కోపం పోయిందిలా!

ABN , First Publish Date - 2020-05-25T05:26:55+05:30 IST

ఒక ఊళ్లో ఓ అబ్బాయి ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. తన కోపంతో మాటలు జారి ఇతరుల మనస్సును గాయపరిచేవాడు. అతని ప్రవర్తనను గమనించిన తండ్రి ఎలాగైనా కొడుకులో మార్పు తేవాలని

కోపం పోయిందిలా!

ఒక ఊళ్లో ఓ అబ్బాయి ఉండేవాడు. అతనికి కోపం ఎక్కువ. తన కోపంతో మాటలు జారి ఇతరుల మనస్సును గాయపరిచేవాడు. అతని ప్రవర్తనను గమనించిన తండ్రి ఎలాగైనా కొడుకులో మార్పు తేవాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకరోజు సంచీలో మేకులు, సుత్తి తీసుకొచ్చి కుమారునికి ఇచ్చాడు. ‘‘నీకు కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఓ మేకు కొట్టు’’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్టుగా అతడు మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. మొదట కొన్ని రోజులు ఎక్కువ మేకులు కొట్టాడు. కొన్ని వారాలు గడిచాక మేకులు కొట్టడం తక్కువయింది.


నెమ్మదిగా కోపం నియంత్రణలోకి వచ్చింది. ఒకరోజు ఆ అబ్బాయికి కోపం రాలేదు. తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. అప్పుడు తండ్రి ‘‘నీకు కోపం రాలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు గోడకు కొట్టిన మేకులను ఒక్కొక్కటిగా తొలగించు!’’ అని చెప్పాడు. ఆ అబ్బాయి అలాగే చేశాడు. అప్పుడు తండ్రి ‘‘నువ్వు గోడకు కొట్టిన మేకులు తొలగించావు. కానీ ఆ గోడకు పడిన రంధ్రాలు చూడు. అవి ఎప్పటికీ అలాగే  ఉంటాయి. వాటిలో సిమెంటు పూసినా ఆ గోడను మునుపటి గోడలా మార్చడం సాధ్యం కాదు. అలాగే నీ కోపం వల్ల గాయపడిన వారి మనసు కూడా అంతే. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకో!’’ అని సూచించాడు.

Updated Date - 2020-05-25T05:26:55+05:30 IST