Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాన్నా.. మీ మనవడు చనిపోయాడు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడాది తర్వాత కూతురి నుంచి ఫోన్.. ఆ తండ్రి పక్కా ప్లాన్‌తో ఎంత ఘోరం చేశాడంటే..

ఆమె పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంది.. పెళ్లి తర్వాత వేరే ఊరు వెళ్లిపోయి భర్తతో కాపురం పెట్టింది.. ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఎనిమిది నెలల ఆ చిన్నారి ఇటీవల మరణించాడు.. దు:ఖాన్ని తట్టుకోలేకపోయిన ఆమె తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.. అయ్యో పాపం అని జాలి చూపాల్సింది పోయి కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో ఆ తండ్రి పగ తీర్చుకోవాలనుకున్నాడు.. పక్కాగా ప్లాన్ చేశాడు.. కొడుకు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను చంపేశాడు.. ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లో జరిగింది. 


భోపాల్‌కు సమీపంలోని బుకేష్‌గంజ్ అనే ప్రాంతానికి చెందిన కమలేష్ అనే వ్యక్తి కూతురు గతేడాది ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలిసి రాయ్‌పూర్‌లో నివసిస్తోంది. ఎనిమిది నెలల క్రితం జన్మించిన మగ బిడ్డ అనారోగ్యం కారణంతో దీపావళి రోజు రాత్రి చనిపోయాడు. ఆ దు:ఖాన్ని ఆమె తన తండ్రితో పంచుకుంది. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడింది. విషయం విని చింతించాల్సిన ఆ తండ్రి పాత విషయాన్ని గుర్తు పెట్టుకుని కూతురిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎనిమిది నెలల బాబు మృతదేహాన్ని అడవిలో పాతి పెడదామని చెప్పి కూతురిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే ఆమెను గొంతు నులిమి చంపేశాడు. 


ఆ విషయాన్ని భార్యకు, పెద్ద కూతురికి ఫోన్ ద్వారా చెప్పి పరారయ్యాడు. మృతదేహం గురించి సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కమలేష్‌ను అరెస్ట్ చేశారు. తన కూతురు చేసుకున్న ప్రేమ వివాహం వల్ల తమ పరువు పోయిందని, ఏడాది పాటు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయామని, అందుకే ఆమెను చంపేశానని కమలేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు.   

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement