Advertisement
Advertisement
Abn logo
Advertisement

భార్యపై కోపాన్ని కూతురుపై చూపించిన భర్త.. పాపం జ్వరంతో ఉన్న ఆ చిన్నారిని లాక్కొని..

ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రుల మధ్య గొడవకు అభంశుభం తెలియని ఓ చిన్నారి బలైపోయింది. కన్నతండ్రి చేతిలోనే ప్రాణాలు వదిలింది. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన పవన్ సహారియా అనే వ్యక్తికి సీమా అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అరణ్యా అనే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఈ దంపతులకు 5ఏళ్ల బాబు, ఆరుషి అనే 6నెలల పాప ఉన్నారు. కాగా.. సోమవారం రోజు భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో సీమా పిల్లలతో సహా కెల్వారా గ్రామానికి వచ్చేసింది. భర్త గురించి అత్తామాలకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మంగళవారం రోజు పవన్ సహారియా కూడా కెల్వారా గ్రామాని చేరుకున్నాడు. దంపతుల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. ఈ క్రమంలో తల్లి ఒడిలో పాలు తాగుతున్న ఆరుషిని.. పవన్ సహారియా లాగేసుకున్నాడు. అనంతరం నేలకేసి బాదాడు. దీంతో ఆరుషి తలకు గాయమై.. తీవ్ర రక్తస్రావం అయింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జ్వరంతో ఉన్న ఆరుషిని తనతోపాటు తీసుకెళ్తానని పవన్ సహారియా పట్టుపబట్టాడని.. దానికి తాను నిరాకరించడంతో చిన్నారిని లాక్కుని నెలకేసి కొట్టినట్లు పోలీసులకు తెలిపిన వివరాల్లో వెల్లడించింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement