‘లాస్ట్ డే ట్రీట్మెంట్’ అంటూ అనిల్ కపూర్ పోస్ట్... ‘ఏమైంది?’ అంటూ నెటిజన్స్ ఆరా...

బాలీవుడ్ సీనియర్ నటుడు అనీల్ కపూర్ ఓ వీడియో షేర్ చేశాడు. జర్మనీలో ఆయన నడిచి వెళుతుండగా తీసిన క్లిప్పింగ్ అది. వీడియోతో పాటూ ఆయన రాసిన క్యాప్షన్‌లో... ‘‘మంచులో ఓ అద్భుతమైన నడక... జర్మనీలో చివరి రోజు!’’ అంటూ పేర్కొన్నాడు. అయితే, ‘‘డాక్టర్ ముల్లర్‌ను చూసేందుకు వెళుతున్నాను. వైద్యంలో చివరి రోజు!’’ అని కూడా అనీల్ రాయటం, చాలా మంది నెటిజన్స్‌ను ఆలోచనలో పడేసింది. బాలీవుడ్ సీనియర్ స్టార్‌కు ఏమై ఉంటుందని చర్చించుకున్నారు... 


‘‘ట్రీట్మెంట్ దేనికి? మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా...’’ అని ఒక అనీల్ కపూర్ అభిమాని కామెంట్ చేశాడు. ‘‘మీ ఆరోగ్యం బాగానే ఉందని నేను భావిస్తున్నాను...’’ అంటూ మరో నెటిజన్ తన ఆందోళన వ్యక్తం చేశాడు. కాలి పిక్కలు, మడిమల ప్రాంతంలో కండరాలకు సంబంధించి తనకు అనారోగ్య సమస్యలున్నాయని గత ఏడాదే అనీల్ కపూర్ చెప్పాడు. బహుశా దాని ట్రీట్మెంట్ కోసమే ఆయన జర్మనీ వెళ్లి వుంటాడని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇంత వరకూ అనీల్‌గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ అధికారికంగా స్పందించలేదు...  

Advertisement

Bollywoodమరిన్ని...