అండగా ఉంటాం..

ABN , First Publish Date - 2020-07-02T16:29:27+05:30 IST

పర్యాటక శాఖ ఉద్యోగి ఉషారాణిని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్..

అండగా ఉంటాం..

ఉషారాణికి మంత్రి అనిల్‌ భరోసా

పలువురు ప్రముఖుల పరామర్శ


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖ ఉద్యోగి ఉషారాణిని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బుధవారం పరామర్శించారు. దివ్యాంగురాలైన ఆమెపై ఇటీవల డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ దాడి చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొండాయపాళెం గేటు ప్రాంతంలోని ఉషారాణి నివాసానికి మంత్రి వెళ్లి పరామర్శించారు. భాస్కర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఉషారాణికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇదేవిధంగా ఉషారాణిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి కూడా బుధవారం టూరిజం హోటల్‌లో పరామర్శించారు. మహిళలపై దాడులు చేస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. దాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. 


అలాగే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లపాక అనురాధ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు విజేత తదితరులు కూడా ఉషారాణిని పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హ్యూమన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ వైస్‌ ప్రెసిడెంట్‌ చిలక ప్రవీణ్‌ కుమార్‌ కూడా పరామర్శించారు. 


Updated Date - 2020-07-02T16:29:27+05:30 IST