మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి పనిచేయబోతున్నారా? అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్లో రామ్‌చరణ్ మెరవబోతున్నాడా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల అనిల్ రావిపూడిని కలిశారట. ఆయనతో కథ విషయమై సంప్రదింపులు జరిపారట.
`ఆర్ఆర్ఆర్` చిత్రీకరణ పూర్తి కానున్న నేపథ్యంలో రామ్‌చరణ్ తన తర్వాతి సినిమా కోసం కథలు వింటున్నాడట. అందులో భాగంగానే చెర్రీకి అనిల్ ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో అనిల్‌తో పనిచేసేందుకు చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందట.