Abn logo
Jul 7 2020 @ 12:18PM

అనిల్ రావిపూడి ప్లాన్-బి?

వరుస విజయాలు అందుకుంటూ టాప్ లీగ్‌లోకి దూసుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది ఇప్పటికే `సరిలేరు నీకెవ్వరు`తో విజయం అందుకున్న అనిల్ లాక్‌డౌన్‌కు ముందే `ఎఫ్2` సీక్వెల్ `ఎఫ్3` కథను పూర్తి చేశాడు. ఈ ఏడాది దసరాకు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. 


వెంకటేష్ `నారప్ప`తో బిజీగా ఉండడమే దీనికి కారణం. ఈ ఏడాది చివర్లో `నారప్ప`ను ప్రారంభించాలని వెంకీ అనుకుంటున్నారట. అది పూర్తి చేసిన తర్వాతే ఆయన `ఎఫ్3` సెట్స్ పైకి వస్తారట. అప్పటి వరకు అనిల్‌కు వెయిటింగ్ తప్పదు. అందుకే `ఎఫ్3` కంటే ముందు ఓ యంగ్ హీరోతో సినిమా చేయాలని అనిల్ అనుకుంటున్నాడట. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అనిల్ అధికారిక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement