May 5 2021 @ 11:21AM

అనిల్ రావిపూడి మరో మల్టీస్టారర్..?

అనిల్రా విపూడి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఎఫ్ 3. ఎఫ్ 2కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 3 సెట్స్ మీదుండగానే మరో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారే నందమూరి హీరోలని సమాచారం. గత ఏడాది నుంచి అనిల్ రావిడి - బాలయ్య కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నప్పటికి అధికారక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సొషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు బాలయ్యకి తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించే అవకాశం ఉండగా.. కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నట్టు ప్రచారమవుతోంది. ఇందులో ఎంతవరకు వాస్తవమన్నది క్లారిటీ లేనప్పటికి అభిమానుల్లో మాత్రం ఈ వార్త ఉత్సాహాన్ని నింపుతోంది.