Abn logo
Aug 1 2020 @ 12:29PM

బాలయ్యను ఒప్పించాడా?

వరుస విజయాలతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని అనిల్ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య కోసం గతంలో `రామారావుగారు` అనే టైటిల్‌తో సబ్జెక్ట్ కూడా సిద్ధం చేశాడు. అయితే బాలయ్యకు ఆ కథ నచ్చకపోవడం వల్లో, డేట్లు అడ్జెస్ట్ కాకపోవడం వల్లో అప్పట్లో ఆ సినిమా పట్టాలెక్కలేదు. 


తాజాగా మరోసారి బాలయ్యను అనిల్ కలిసినట్టు సమాచారం. బాలయ్య బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే విధంగా అనిల్ కథను సిద్ధం చేశాడట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలయ్య ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. బాలయ్య చేతిలో ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ఉంది. దాని తర్వాత అనిల్ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement