ఇంతకన్న దద్దమ్మ సీఎం ఉంటారా? : అనిత

ABN , First Publish Date - 2021-06-11T22:26:12+05:30 IST

కరోనా సమయంలో ఆస్తిపన్ను పెంచడం దారుణమని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు.

ఇంతకన్న దద్దమ్మ సీఎం ఉంటారా? : అనిత

విశాఖ: కరోనా సమయంలో ఆస్తిపన్ను పెంచడం దారుణమని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత మండిపడ్డారు. తూతూ మంత్రంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారీగా పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు. ఆస్తి విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విశాఖలో టీడీపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా అనిత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో వ్యాపారాలు లేవని, చేసుకోడానికి పనులులేవని, ఇలాంటి సందర్భంలో ఆస్తి పన్ను పెంచారంటే ఇంతకంటే దౌర్భగ్యమైన పరిస్థితి ఉంటుందా?.. ఇంతకన్న దద్దమ్మ సీఎం ఉంటారా? అని ప్రశ్నించారు. ఆస్తిపన్ను పెంపుపై కౌన్సిల్‌లో తీర్మానం లేకుండా ఎలా పెంచుతారని ఆమె నిలదీశారు. ఆస్తి పన్ను పెంచేసి ప్రజల నుంచి సొమ్ములు లాక్కుందామనే భావనలో సీఎం జగన్ ఉన్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రజలకు చేయూత ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోడానికి, దాచుకోడానికి తప్పించి ప్రజలను ఉద్దరించే ఒక్క నాయకుడు ఆ పార్టీలో లేరని దుయ్యబట్టారు. పెంచిన ఆస్తి పన్నును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని అనిత స్పష్టం చేశారు.

Updated Date - 2021-06-11T22:26:12+05:30 IST