కనుల పండువగా అంజన్న రథోత్సవం

ABN , First Publish Date - 2022-02-02T07:23:49+05:30 IST

అశేష జనవాహిని నడుమ అభయాంజనేయు డి రథోత్సవం కనుల పండువగా సాగడంతో భక్తుల పరవశంతో అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు, ఊర్కొండపేట పుర వీధులు మారు మోగాయి.

కనుల పండువగా అంజన్న రథోత్సవం
రథోత్సవానికి హాజరైన భక్తులు

 - స్వామి వారి నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు

 - రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి


ఊర్కొండ, ఫిబ్రవరి 1: అశేష జనవాహిని నడుమ అభయాంజనేయు డి రథోత్సవం కనుల పండువగా సాగడంతో భక్తుల పరవశంతో అంజన్న నామస్మరణతో ఆలయ పరిసరాలు, ఊర్కొండపేట పుర వీధులు మారు మోగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండపేట గ్రామ శివారులో వెలసిన అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు వైభ వంగా జరుగుతున్నాయి. మంగళవారం అభయుడి రథోత్సవం సందర్భం గా భక్తులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబా ద్‌, ప్రకాశం, గుంటూరు, కర్నూల్‌ జిల్లాల నుంచి భారీగా తర లిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. జైశ్రీరాం, జై హనుమా న్‌ నామస్మరణతో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రథం ముందుకు సాగింది. ముందుగా స్వామి వారికి పంచ సూక్తములతో పూజలు నిర్వ హించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాల నడుమ తీసుకు వచ్చి పూలతో అలంకరించిన రథంలో ఆశీనులు చేసి మహబూబ్‌నగర్‌ జిల్లా టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఎంపీపీ బక్కరాధ, జడ్పీటీసీ శాంతకుమారి, సర్పంచ్‌ అనిత, ఎంపీటీసీ ఈశ్వర మ్మ, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యురాలు మ ట్ట కలమ్మ, కర్నాటి శ్రీనివాస్‌గౌడ్‌, రాచకొండ గోపి, రమేష్‌గౌడ్‌ తదితరులు కొబ్బరికాయలు కొట్టి రథో త్సవాన్ని ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, కల్వకుర్తి, వెల్దండ సీఐలు ఆవుల సైదులు, రామకృష్ణ ఊర్కొండ, కల్వ కుర్తి, వెల్దండ ఎస్సైలు విజయ్‌కుమార్‌, మహేంద ర్‌, నర్సింహులు పోలీసు సిబ్బందితో పటిష్ట బం దోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు వసతులు కల్పించారు. మండల సర్పంచుల సం ఘం అధ్యక్షుడు కొమ్మురాజయ్య, సర్పంచులు అనిల్‌రెడ్డి, ఆంజనేయులు, సుదర్శన్‌, ని రంజన్‌గౌడ్‌, ఎంపీటీసీలు గోపాల్‌ గుప్త, లావణ్య, బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్యాసుందర్‌రెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ ముచ్చర్ల జనా ర్దన్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, గిరి నాయక్‌, బక్క జంగయ్య, రమేష్‌, ర వీందర్‌, రమేష్‌నాయక్‌, నాగోజీ, ప్ర భాకర్‌, కృష్ణగౌడ్‌, మల్లేష్‌గౌడ్‌, శంకర్‌, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌, చంద్రకాంత్‌, రా మాంజనేయులుగౌడ్‌ అర్చకులు దత్తాత్రే య శర్మ, శ్రీనివాసశర్మ, ప్రవీణ్‌శర్మ, మహేష్‌శర్మ,  సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-02-02T07:23:49+05:30 IST