Abn logo
Aug 15 2020 @ 17:54PM

ఆ ఫ్లాట్ ఈఎంఐలు నేనే కడుతున్నా.. సుశాంత్ కాదు: నటి అంకిత

ముంబై: మలాడ్‌లోని తన ఫ్లాట్‌కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈఎంఐలు చెల్లించినట్టు వస్తున్న వార్తలను నటి అంకిత లోఖండే ఖండించారు. తన ఫ్లాట్‌కు సుశాంత్ ఎప్పుడూ ఈఎంఐ చెల్లించలేదని, తానే చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు, తానే చెల్లిస్తున్నట్టు ఉన్న బ్యాంకు స్టేట్‌మెంట్‌ను షేర్ చేసింది. ‘‘ఈ విషయంలో నేను వీలైనంత పారదర్శకంగా ఉంటాను. ఈఎంఐ చెల్లింపులపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నా. ఇవి నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు. అలాగే, నా బ్యాంకు ఖాతా నుంచి నెలనెలా ఈఎంఐ కట్ అవుతోంది. ఇంతకుమించి చెప్పడానికేమీ లేదు’’ అని అంకిత వరుస ట్వీట్లలో పేర్కొంది. 


కాగా, సుశాత్ స్నేహితురాలు, నటి అంకిత ఉన్న ఫ్లాట్ సుశాంత్ పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని, అతడి బ్యాంకు ఖాతా నుంచే ప్రతి నెల ఈఎంఐ చెల్లింపులు జరుగుతున్నట్టు శుక్రవారం ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఫ్లాట్ విషయంలో కొంత గందరగోళం ఉంది. సుశాంత్ ఫ్లాట్ నంబరు 403 కాగా, అంకిత ఫ్లాట్ నంబరు 404. సుశాంత్ తన ఫ్లాట్ ఈఎంఐలు మాత్రమే చెల్లిస్తుండగా, అంకిత తన ఫ్లాట్ ఈఎంఐలు చెల్లిస్తున్నట్టు అంకిత షేర్ చేసిన పత్రాల ద్వారా తెలుస్తోంది.  

Advertisement
Advertisement
Advertisement