Advertisement
Advertisement
Abn logo
Advertisement

పని వేళలు తగ్గించాలి.. కలెక్టరేట్ వద్ద ANMల ధర్నా

మహబూబ్‌నగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఎన్‌ఎంలు మెరుపు ధర్నాకు దిగారు. కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసే దశలో భాగంగా ఏఎన్‌ఎంలపై పనిభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. మెరుపు ధర్నా చేపట్టారు. ప్రతి రోజూ దాదాపు 12 గంటలు విధులు నిర్వహిస్తున్నామని, రాత్రి సమయంలో కూడా పనిచేయాల్సి వస్తోందని వాపోయారు. ఒత్తిడి చేస్తే విధి నిర్వహణ కష్టమవుతోందన్నారు. తమకు పని వేళలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్ టార్గెట్లు ఎత్తివేయాలని కోరారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement