అమ్మ క్యాంటీన్‌లో విధ్వంసం

ABN , First Publish Date - 2021-05-05T16:03:57+05:30 IST

నగరంలోని అమ్మ క్యాంటీన్‌లో డీఎంకే కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం ఈ అరాచకానికి పాల్పడిన ఇద్దరు కార్యకర్తలను పార్టీ నుంచి బ

అమ్మ క్యాంటీన్‌లో విధ్వంసం


ప్యారీస్‌(చెన్నై): నగరంలోని అమ్మ క్యాంటీన్‌లో డీఎంకే కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం ఈ అరాచకానికి పాల్పడిన ఇద్దరు కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించింది. మదురవాయల్‌లో డీఎంకే గెలవడంతో మంగళవారం ఆ పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ముగప్పెయిర్‌ జేజే నగర్‌ రోడ్డులో ర్యాలీ వస్తుండగా, కొందరు కార్యకర్తలు రోడ్డు పక్కనే ఉన్న అమ్మ క్యాంటీన్‌ లోకి చొరబడ్డారు. క్యాంటీన్‌ ముందుంచిన బోర్డు, లోపల జయలలిత ఫొటో సహా ధరల పట్టిన తదితరాలను చింపివేసి బయట పడేశారు. కార్యకర్తల దాడిలో కాయగూరలు చెల్లాచెదురు కాగా, అడ్డుకోబోయిన క్యాంటీన్‌ సిబ్బందిపై కూడా కార్యకర్తలు దాడికి దిగినట్లు సమాచారం. క్యాంటీన్‌లో కార్యకర్తలు చొరబడడం, బోర్డులు ధ్వంసం చేయడం దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌ఛల్‌ చేశాయి. ఈ ఘటనపై అన్నాడీఎంకే, పీఎంకే సహా పలు పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. సోషల్‌ మీడియాలో ఈ దృశ్యాలను చూసిన పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌, అరాచకాలను పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని పార్టీ ఎమ్మెల్యే సుబ్రమణియన్‌ను ఆదేశించారు. ఈ వ్యవ హారంపై విచారణ చేసిన పార్టీ అధిష్ఠానం ఇద్దరు కార్యకర్తలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.


Updated Date - 2021-05-05T16:03:57+05:30 IST