Abn logo
May 5 2021 @ 08:52AM

రాజీనామాలపై ఊగిసలాట..

            - ఎటూ తేల్చుకోలేని అన్నాడీఎంకే ఎంపీలు


అడయార్‌(చెన్నై): ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యులు కేపీ.మునుస్వామి, ఆర్‌.వైద్యలింగం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ.. తమ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు మంత్రి పదవులు దక్కించుకోవచ్చన్న భావనతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత అన్నాడీఎంకే అధికారాన్ని కోల్పోయింది. దీంతో వీరి లక్ష్యం నెరవేకుండానేపోయింది. ఈనేపథ్యంలో ఇపుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా లేక రాజ్యసభ సభ్యత్వాలను వదులకోవాలన్న అంశంపై వారు ఊగిసలాడుతున్నారు. ముఖ్యంగా కేపీ మునుస్వామి అయితే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంకు కుడిభుజంగా వ్యహరించిన మునుస్వామి... ఇపుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.మరోవైపు ఆర్‌.వైద్యలింగం మాత్రం రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుని ఎమ్మెల్యేగా కొనసాగేందుకు నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement