అన్నా వర్సిటీలో సర్టిఫికెట్‌ ఫీజుల పెంపు

ABN , First Publish Date - 2022-05-06T16:25:22+05:30 IST

అన్నా విశ్వవిద్యాలయ మార్కుల జాబితాతో పాటు సర్టిఫికెట్ల ఫీజులు పెరిగాయి. మార్కుల వివరాలతో కూడిన ట్రాన్స్‌క్రిప్ట్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.1,500గా నిర్ణయించారు. గ్రేడ్‌ వివరాలతో కూడి

అన్నా వర్సిటీలో సర్టిఫికెట్‌ ఫీజుల పెంపు

ఐసిఎఫ్‌(చెన్నై): అన్నా విశ్వవిద్యాలయ మార్కుల జాబితాతో పాటు సర్టిఫికెట్ల ఫీజులు పెరిగాయి. మార్కుల వివరాలతో కూడిన ట్రాన్స్‌క్రిప్ట్‌ సర్టిఫికెట్‌ కోసం రూ.1,500గా నిర్ణయించారు. గ్రేడ్‌ వివరాలతో కూడిన ఒరిజినల్‌ సర్టిఫికెట్‌ రెండో కాపీ కోసం రూ.3 వేలు, సంయుక్త గ్రేడ్‌ మార్కుల సర్టిఫికెట్‌ రెండో ప్రతికి రూ.5 వేలు, డిగ్రీ సర్టిఫికెట్‌ ఒరిజినల్‌ ప్రతికి రూ.10 వేలు, తాత్కాలిక డిగ్రీ సర్టిఫికెట్‌లో సవరణలకు రూ.500 ఫీజుగా నిర్ణయించారు. డిగ్రీ సర్టిఫికెట్లలో నెల, సంవత్సరం పేర్కొనేందుకు రూ.300, నిజ నిర్ధారణ సర్టిఫికెట్లకు భారత సంస్థలకు రూ.2 వేలు, విదేశీ సంస్థలకు 100 అమెరికా డాలర్లు (భారత విలువలో రూ.7,500)గా నిర్ణయించారు.

Read more