Abn logo
Dec 23 2020 @ 16:28PM

ఆగిపోయిన ‘రజినీ’ సినిమా షూటింగ్.. కారణం ఏంటంటే..

రజినీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం

ఏడుగురికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేత

హైదరాబాద్: సినీ నటుడు రజినీకాంత్ తాజా సినిమా ‘అన్నాత్తే’ షూటింగ్‌లో కరోనా కలకలం రేగింది. షూటింగ్ సిబ్బందిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుండటం గమనార్హం. రజినీకాంత్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌‌ను పాటించనున్నట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఆయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నట్లు ‘అన్నాత్తే’ టీం తెలిపింది. తమిళ హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు శివ ‘అన్నాత్తే’కు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement