జనవరిలో అన్నాడీఎంకే Plenary Meeting

ABN , First Publish Date - 2021-12-28T14:25:54+05:30 IST

ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను సంక్రాంతిలోపున పూర్తి చేయడానికి ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. వచ్చేవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కార్యదర్శులు, నగర శాఖల కార్యదర్శుల పదవులకు ఎన్నికలు

జనవరిలో అన్నాడీఎంకే Plenary Meeting

సంక్రాంతిలోగా సంస్థాగత ఎన్నికలు

చెన్నై: ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలను సంక్రాంతిలోపున పూర్తి చేయడానికి ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. వచ్చేవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కార్యదర్శులు,  నగర శాఖల కార్యదర్శుల పదవులకు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. తొలుత పార్టీ సమన్వయకర్త, ఉప సమన్వయకర్త పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఉప సమన్వయకర్తగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్తగా ఒ. పన్నీర్‌సెల్వం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తొలి విడతగా 35 పార్టీ జిల్లాల శాఖలలో, రెండోవిడతగా 40 పార్టీ జిల్లాల శాఖలలో నగర పంచాయతీ, గ్రామపంచాయతీ, పట్టణ పంచాయతీ శాఖలకు సంబంధిం చిన పదవులకు ఎన్నికలు జరి గాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన జిల్లా శాఖలు, నగర శాఖల కార్యదర్శుల పదవులకు, కార్పొరేషన్‌, మున్సిపాలిటీ శాఖల కార్యదర్శుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ. పన్నీర్‌సెల్వం సిద్ధమయ్యారు. ఆ మేరకు సంక్రాంతిలోపు సంస్థాగత ఎన్నికలను పూర్తిచేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికకైన పార్టీ కొత్త నాయకులతో సర్వసభ్య మండలి సమావేశాన్ని జనవరి నెలాఖరున జరపాలని నిర్ణయించారు. అదే సమయంలో పార్టీ కార్యాచరణ మండలి సమావేశాన్ని కూడా జరుపనున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎడప్పాడి వర్గానికి, పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన పలువురు నేతలు పోటీపడుతున్నారు. పార్టీలో తమ వర్గీయులను ఎన్ని క చేసుకునే దిశగా వీరిరువురూ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమ వర్గాలకు చెందిన అభ్యర్థులను పోటీకి దింపేందుకు తగు వ్యూహరచనలు కూడా చేస్తున్నారు.

Updated Date - 2021-12-28T14:25:54+05:30 IST