అన్నమయ్య ప్రాజెక్టు గేటు మొరాయింపు

ABN , First Publish Date - 2020-11-28T06:01:43+05:30 IST

రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు గేటు మొరాయించడంతో వరదనీరు వృథాగా పోతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది.

అన్నమయ్య ప్రాజెక్టు గేటు మొరాయింపు
అన్నమయ్య ప్రాజెక్టు గేటు మొరాయించడంతో వృథాగా పోతున్న వరద నీరు

వృథాగా పోతున్న వరద నీరు

కడప, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు గేటు మొరాయించడంతో వరదనీరు వృథాగా పోతోంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. పింఛా ప్రాజెక్టు తెగిపోయి ఆ వరదంతా అన్నమయ్య ప్రాజెక్టుకు చేరింది. అదే క్రమంలో ఈ ప్రాజెక్టులోని కేజ్‌ కల్చర్‌ (చేపల పెంపకానికి ఉపయోగించే బోను) వరద ఉధృతికి 5వ నెంబరు గేటును ఢీకొనడంతో ఆ గేటు వంకర పోయినట్లు తెలిసింది. వరద తగ్గి గేట్లు మూసే సమయానికి అది మొరాయించింది. దీంతో జలాశయం ఖాళీ అవుతోంది. గతంలో గేట్లు కొట్టుకుపోవడంతో కొత్త గేట్లను 2015లో స్వప్న కనస్ట్రక్షన సంస్థ ఏర్పాటు చేసింది. ఈ విషయంపై ప్రాజెక్టు ఇనచార్జ్‌ డీఈ వెంకటరామయ్య మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, నేడు  గేట్లు ఏర్పాటు చేస్తారని అన్నారు. అయితే పాలకులు, ఇంజనీర్ల వైఫల్యం వల్లే అన్నమయ్య గేటు మొరాయించడం, పింఛా ప్రాజెక్టుకు గండిపడడం జరిగిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెంగల్రాయులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఆరోపించారు.

నందలూరురైల్వే బ్రిడ్జి వద్ద అప్రమత్తం

నందలూరు సమీపంలోని చెయ్యేరు రైల్వే బ్రిడ్జి వద్ద అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ వారు హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబరు 1వ తేది వరకు ప్రమాదం పొంచి ఉందని ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగి రైల్వే వెంతెనపై ప్రవహించే అవకాశం ఉందని సూచించారు.

Updated Date - 2020-11-28T06:01:43+05:30 IST