Abn logo
Apr 9 2021 @ 00:47AM

హైదరాబాద్‌కు అన్నాత్తే!

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ కోసం రజనీకాంత్‌ గురువారం విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారని సమాచారం. డిసెంబర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ఆయన అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరటంతో నిలిపివేశారు. కొన్ని రోజుల క్రితం చెన్నైలో షూటింగ్‌ ప్రారంభమైంది. 


శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే షూటింగ్‌లో రజనీకాంత్‌ పాల్గొంటారు. దాదాపు నెల రోజుల పాటు రజనీ షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. ‘అన్నాత్తే’ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌, నయనతార హీరోయిన్లు. ఖుష్బు, మీనా, ప్రకాశ్‌రాజ్‌, జాకీష్రాఫ్‌, జగపతిబాబు ప్రధాన తారాగణం. శిరుతాయ్‌ శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement