Advertisement
Advertisement
Abn logo
Advertisement

వర ‘ప్రసాద్‌’మేనా!

సత్యదేవుని ఆలయంలో రూ.92.4 కోట్లతో 

రూపొందించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేరిక

మాస్టర్‌ ప్లాన్‌ అమలు దిశగా వేగంగా అడుగులు 

వెల్లడించిన అన్నవరం దేవస్థానం అధికారులు

అన్నవరం, డిసెంబరు 7: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుని సన్నిధిలో రాబోయే 30 ఏళ్లకు అనుగుణంగా చేపట్టబోయే అభివృద్ధి పనులపై రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ అమలుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రసాద్‌ పథకం ద్వారా నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేప థ్యంలో ఇటీవల కాకినాడ ఎంపీ గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌, టూరిజం అధికారులు, దేవస్థానం అధికారులు రూ.92.4 కోట్ల పనులకు రూపొందించిన ప్రతిపాదనలు మంగళవారం కేంద్రానికి చేరినట్టు దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. వీటిలో ప్రధానంగా ప్రకాష్‌సదన్‌ వెనుక భాగంలో రత్నగిరి, సత్యగిరి మధ్య అన్నదానం భవనం, టీటీడీ సత్రంలో రెండతస్తుల్లో వ్రత మండపాలు, కొండ దిగువున ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా డార్మెటరీ నిర్మాణం, ట్రాఫిక్‌ నియంత్రణకు వనదుర్గ ఆలయం నుంచి రింగ్‌ రోడ్డు, మెట్ల మార్గాన్ని ఆధునికీరించి స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ రెయిలింగ్‌, నూతనంగా నిర్మించే రూ.300 వ్రత మండపాల నుంచి ప్రధానాలయానికి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ద్వారా నేరుగా క్యూలైన్‌, సత్యదేవ అతిథిగృహం నుంచి కేశఖండనశాల వరకు రోడ్డు విస్తరణ, సత్యగిరి కొండపై ఓపెన్‌ థియేటర్‌, సౌండ్‌, లైటింగ్‌షో, అన్నవరం ఆలయానికి సంబంధించి ఒకేచోట నుంచి సీసీ కెమెరాలను మోనటరింగ్‌ చేసే సెంట్రలైజ్డ్‌ సిస్టమ్‌, కొండ దిగువున, కొండపైన ఆరుచోట్ల టాయిలెట్ల నిర్మాణం వున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు మంజూరు చేస్తుంది. వేటిని ఆమోదిస్తుంది అనేది వేచి చూడాలి. ఇటీవల అన్నవరం ఆలయానికి విచ్చేసిన దేవదాయ శాఖ మంత్రి... ప్రతిపాదించిన పనుల్లో కేంద్రం ఆమోదించగా మిగిలిన పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేయించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం విశేషం.

Advertisement
Advertisement