సత్యదేవా...!

ABN , First Publish Date - 2021-10-19T05:26:24+05:30 IST

అన్నవరం, అక్టోబరు 18: సుదూర ప్రాంతాల నుంచి సత్యదేవుని దర్శనానికి విచ్చేసే భక్తులు పలు రకాల పూజలు చేస్తూ, వ్రతాలు ఆచరిస్తూ హుండీల్లో కానుకలు వేస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు. అయితే అలా వచ్చిన ఆదాయంతో ఏ విభాగానికి ఆ విభాగ వ్యయం చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారులు వ్యయంచేసిన వాటికి సరైన రికార్డులు సమర్పించక ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలు సుదీర్ఘ

సత్యదేవా...!

అన్నవరం దేవస్థానంలో ఆడిట్‌ అభ్యంతరాలు పరిష్కారమయ్యేదెప్పుడో!

2002 నాటి రూ.16.53 కోట్లకు కనిపించని రికార్డులు

ప్రస్తుతం పని చేస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన     

53 మంది ఉద్యోగులపై అభియోగాలు

ఆలస్యమైతే తొలగిపోతాయనే భ్రమలో కొందరు 

అన్నవరం, అక్టోబరు 18: సుదూర ప్రాంతాల నుంచి సత్యదేవుని దర్శనానికి విచ్చేసే భక్తులు పలు రకాల పూజలు చేస్తూ, వ్రతాలు ఆచరిస్తూ హుండీల్లో కానుకలు వేస్తూ స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు. అయితే అలా వచ్చిన ఆదాయంతో ఏ విభాగానికి ఆ విభాగ వ్యయం చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికారులు వ్యయంచేసిన వాటికి సరైన రికార్డులు సమర్పించక ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలు సుదీర్ఘకాలంగా పెం డింగులో ఉన్నాయి. 1989 నుంచి 2002 వరకు సుమారు రూ.68 కోట్ల ఆడిట్‌ అభ్యంతరాలున్నారు. దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా దశలవారీగా ఆడిట్‌ అభ్యంతరాలకు సంబంధించి పలు అభ్యంతరాలను పరిష్కరించుకోగలిగారు. ఇంకా సుమారు రూ.16.53 కోట్లకు సంబంధించి రికార్డులు లభ్యం కాకపోవడంతో వాటిని ఎలా తొలగించుకోవాలనే దానిపై సంబంధిత అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.


కొందరు ఉద్యోగులు మాత్రం దశాబ్దకాలం దాటితే అభ్యంతరాలు వాటంతట అవే తొలగిపోతాయనే భ్రమలో ఉన్నారు. అయితే ఆడిట్‌ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు దానికి సంబంధించి రికార్డులు పోతేనే రద్దు చేస్తారని, లేకుంటే అభియోగాలు ఎదుర్కొనే వారి నుంచి రికవరీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు చెప్తున్నారు. ఇలా దేవస్థానంలో ప్రస్తుతం విధులు నిర్వరిస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన 53 మంది ఉద్యోగులపై అభియోగాలున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. రూ.16.53 కోట్లకు సంబంధించి ఎంత ప్రయత్నిస్తున్నా రికార్డులు లభ్యం కాలే దు. ఆ మొత్తాన్ని అభియోగాలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి రికవరీ చేస్తారా లేకపోతే సిబ్బంది రికార్డులు వెతికి సమర్పిస్తామని కాలయాపన చేస్తూ ఆడిట్‌ అధికారులను తప్పుదోవ పట్టిస్తారో వేచి చూడాలి.

Updated Date - 2021-10-19T05:26:24+05:30 IST