శ్రీశైలంలో ఆదిశంకరుల జయంతి

ABN , First Publish Date - 2021-05-17T05:50:10+05:30 IST

ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా జగద్గురు ఆదిశంకరా చార్యుల జయంతి ఉత్సవాన్ని దేవ స్థానం ఘనంగా నిర్వహిచింది.

శ్రీశైలంలో ఆదిశంకరుల జయంతి

  1. రుద్రమూర్తికి విశేష అభిషేకం 


 శ్రీశైలం, మే 16:  ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రంలో ఆదివారం వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా జగద్గురు ఆదిశంకరా చార్యుల జయంతి ఉత్సవాన్ని దేవ స్థానం ఘనంగా నిర్వహిచింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదిశంకరా చార్యులు తపస్సు చేసిన పాలధార - పంచధారల వద్ద వున్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలను జరి పారు.   చంద్ర మౌళీశ్వరస్వా మికి, శారదాదేవీకి, శంకరుల వారికి విశేష  పూజలు జరిపారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి కేఎస్‌ రామరావు పాలొన్నారు. 


 రుద్రమూర్తికి విశేష అభిషేకం 

 క్షేత్రంలో ఆదివారం ఉదయం ఆలయ ఈశాన్య భాగంలోని రుద్ర వనంలోని రుద్రమూర్తికి  దేవస్థానం ఘనంగా అభిషేకం నిర్వహిం చింది. గతంలో ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని క్షేత్రంలో ఈ రుద్రవిగ్రహాన్ని దేవస్థానం వారు ఆవిష్కరించారు.     ఆదిశంకరాచార్యుల జయంతి రోజున రుద్రమూర్తికి కూడా ప్రత్యేక పూజలను దేవస్థానం నిర్వహించింది.   

Updated Date - 2021-05-17T05:50:10+05:30 IST