విఠల రుక్మాబాయి ఆలయ వార్షికోత్సవం

ABN , First Publish Date - 2021-12-06T06:18:47+05:30 IST

మండలంలోని పల్సి(కె) గ్రామంలో విఠల రుక్మాబాయి ఆలయ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విఠల రుక్మాబాయి కల్యాణ వేడుకను కన్నుల పండువగా జరిపారు. కాగా గత మూడు రోజులుగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వినాయక మహరాజ్‌ ఆధ్వర్యంలో

విఠల రుక్మాబాయి ఆలయ వార్షికోత్సవం
వార్షికోత్సవానికి హాజరైన భక్తులు

తలమడుగు, డిసెంబరు 5: మండలంలోని పల్సి(కె) గ్రామంలో విఠల రుక్మాబాయి ఆలయ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విఠల రుక్మాబాయి కల్యాణ వేడుకను కన్నుల పండువగా జరిపారు. కాగా గత మూడు రోజులుగా ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వినాయక మహరాజ్‌ ఆధ్వర్యంలో యజ్ఞ, భజన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి మండల వాసులే కాకుం డా మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. అంతేకాకుండా ఆలయ వార్షికోత్సవ సందర్భంగా గ్రామంలో అంతర్‌ రాష్ట్ర కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఇందులో సర్పంచ్‌ నైతంపాయల్‌ జ్ఞానేశ్వర్‌, గ్రామ పటేల్‌ లక్ష్మణ్‌, మహజన్‌ రాము, దేవరి, ఎంపీపీ కల్యాణం లక్ష్మిరాజేశ్వర్‌,  గ్రామస్థులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T06:18:47+05:30 IST