గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-10-25T05:14:34+05:30 IST

పట్టణంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వైసీపీ కండువాలు కప్పడం, ఒంగోలు బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వైసీపీ జెండాలను తలిగించడంపై టీడీపీ, దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో మహాత్ముడు, జైభీమ్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మహానుభావుల విగ్రహాలకు వైసీపీ జెండాలు, కండువాలు వేయడం వారిని అవమానించడమేనన్నారు.

గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం
మహత్ముని విగ్రహానికి పాలతో శుద్ధి చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు

 వైసీపీ జెండాలు కప్పడం ఉన్మాదం : టీడీపీ

కనిగిరి, అక్టోబరు 24 : పట్టణంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి వైసీపీ కండువాలు కప్పడం, ఒంగోలు బస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వైసీపీ జెండాలను తలిగించడంపై టీడీపీ, దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో మహాత్ముడు, జైభీమ్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మహానుభావుల విగ్రహాలకు వైసీపీ జెండాలు, కండువాలు వేయడం వారిని అవమానించడమేనన్నారు. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. జాతీయ నేతలను అవమానించిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రోషన్‌ సందాని, ఒలేటి చిన్న, మారుతి, బ్రహ్మంగౌడ్‌,  ఐవీ.నారాయణ, ఎస్తానీబాష, ఫిరోజ్‌, కరాటే యాసిన్‌, రామసుబ్బారెడ్డి, అచ్చాల రవి, ప్రసాద్‌, పుల్లారావు, మహ్మద్‌, బ్రాక్‌, ఆనంద్‌, అశోక్‌, రమణయ్య, సత్తి, ఆర్‌కె రాజా, శరత్‌, అప్రోజ్‌, బాబు, యువరాజ్‌, ఏల్చూరి శంకర్‌, కోటా సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

తీవ్రంగా ఖండిస్తున్న దళిత నేతలు 

అంబేడ్కర్‌ విగ్రహం చేతికి  వైసీపీ జెండాలు తగిలించడాన్ని జైభీమ్‌ నాయకుడు సూరే రాజు తీవ్రంగా ఖండించారు. అందుకు నిరసనగా ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు మూసుకుని ఉంటుందని విమర్శించారు. కారకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారపార్టీ జెండాలను జాతీయ నేతల విగ్రహాలకు వేసి అవమానించడం ఉన్మాదంగా భావిస్తున్నామని దళితనేత తాతపూడి ప్రభుదాస్‌ అన్నారు. 


Updated Date - 2021-10-25T05:14:34+05:30 IST