చిత్తూరు జిల్లాలో మరో 1,566 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-23T06:37:03+05:30 IST

జిల్లాలో మరో 1,566 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ఈ కేసులు రావడంతో యాక్టివ్‌ కేసులు సంఖ్య 10,973కు చేరుకున్నాయి.

చిత్తూరు జిల్లాలో మరో 1,566 పాజిటివ్‌ కేసులు

తిరుమల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో మరో 1,566 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో ఈ కేసులు రావడంతో యాక్టివ్‌ కేసులు సంఖ్య 10,973కు చేరుకున్నాయి. కొత్తగా గుర్తించిన కేసులు మండలాల వారీగా.. తిరుపతి అర్బన్‌లో 465, చిత్తూరులో 139, తిరుపతి రూరల్‌లో 53, చంద్రగిరిలో 50, పుత్తూరు, మదనపల్లె మండలాల్లో 41 చొప్పున, ఐరాలలో 37, పలమనేరులో 32, రేణిగుంటలో 31, కుప్పంలో 28, గంగాధర నెల్లూరు, శీకాళహస్తి మండలాల్లో  26 చొప్పున, బంగారుపాళ్యంలో 25, వాల్మీకిపురంలో 24, రామచంద్రాపురంలో 23, చిన్నగొట్టిగల్లులో 22, పీలేరులో 21, రామకుప్పంలో 20, సదుం, తవణంపల్లె మండలాల్లో  18 చొప్పున, పూతలపట్టు, పుత్తూరు, తొట్టంబేడు, యాదమరి మండలాల్లో  17 చొప్పున, చౌడేపల్లె, కలికిరి, గంగవరం మండలాల్లో 16 చొప్పున,బి. కొత్తకోట, కేవీపల్లె మండలాల్లో 15 చొప్పున, పెనుమూరు, నగరి మండలాల్లో  14 చొప్పున, పులిచర్ల, సత్యవేడు, ఎర్రవారిపాలెం మండలాల్లో 13 చొప్పున, గుడిపాల, గుడుపల్లె మండలాల్లో  12 చొప్పున, శాంతిపురం, ములకలచెరువు, గుర్రంకొండ,వి.కోట, బైరెడ్డిపల్లె, కలకడ మండలాల్లో  11 చొప్పున, సోమల, వరదయ్యపాళ్యం, వెదురుకుప్పం మండలాల్లో 10చొప్పున, శ్రీరంగరాజపురం, బుచ్చినాయుడు కండ్రిగ, కేవీబీ పురం మండలాల్లో  9 చొప్పున, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, నిమ్మనపల్లె, పాలసముద్రం మండలాల్లో  8 చొప్పున, పాకాల, పెద్ద తిప్పసముద్రం, పుంగనూరు మండలాల్లో  6 చొప్పున, కార్వేటినగరం, పెద్దపంజాణి, కురబలకోట, వడమాలపేట మండలాల్లో  5 చొప్పున, ఏర్పేడులో 4, పిచ్చాటూరులో 3, నారాయణవనం, నిండ్ర మండలాల్లో  రెండేసి, రొంపిచర్ల, విజయపురం, నగరి మండలాల్లో  ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. 

Updated Date - 2022-01-23T06:37:03+05:30 IST