ఫేక్జాబ్ స్కాం నిందితుడికి మరో 20 రోజుల గడువు
ABN , First Publish Date - 2020-08-04T10:02:19+05:30 IST
రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల దగ్గర అందిన కాడికి వసూళ్లు చేసి వారి నెత్తిన టోపీ పెట్టిన నిందితుడు, ..
ఆంధ్రజ్యోతి, విజయవాడ : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల దగ్గర అందిన కాడికి వసూళ్లు చేసి వారి నెత్తిన టోపీ పెట్టిన నిందితుడు, వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత వడ్డాన రవికుమార్‌కు లిఖిత పూర్వక వివరణ ఇవ్వడానికి మరో 20 రోజుల గ డువును ఆర్టీసీ ఇచ్చింది. బాధితుల ఫిర్యాదులతో అరెస్టు అయి ప్రస్తుతం జైలులో ఉన్న రవికుమార్ ఆర్టీసీ చర్యల నుంచి తప్పించు కోవటానికి గడువుల మీద గడువులు కోరుతున్నాడు.
జూలైతో ఇచ్చిన గడువు అయిపోవడంతో.. తాను జైలులో ఉన్నానని, ప్రస్తుతం వివరణ ఇవ్వలేనని తనకు గడువు కావాలని రవికుమార్ తాజాగా కోరిన సంగతి తెలిసింది. దీనిపై గడువు ఇవ్వకూడదని ముందుగా ఆర్టీసీ భావించినా.. ఇదే ఫైనల్ అంటూ మరో 20 రోజుల అవకాశాన్ని కల్పించింది. అప్పటికీ ఆర్టీసీ చర్యలు తీసుకోకపోతే.. ఉద్దేశపూర్వకంగా తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు.