రైల్వే ద్వారా మరో 60 టన్నుల ఆక్సిజన్‌ రాక

ABN , First Publish Date - 2021-05-05T08:15:35+05:30 IST

దక్షిణ మధ్య రైల్వే చేస్తోన్న ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి మరో 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ చేరింది.

రైల్వే ద్వారా మరో 60 టన్నుల ఆక్సిజన్‌ రాక

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే చేస్తోన్న ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి మరో 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ చేరింది. ఒడిసా నుంచి ఈ ఆక్సిజన్‌ను తీసుకొచ్చిన ఎక్స్‌ప్రెస్‌ రైలు మంగళవారం సనత్‌నగర్‌ గూడ్సు కాంప్లెక్స్‌కు చేరుకుంది. ఆక్సిజన్‌ కోసం దక్షిణ మధ్య రైల్వే నడిపిన రెండో రైలు ఇది. ఏప్రిల్‌ 29న ఈ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు ఖాళీ ట్యాంకర్లను ఇక్కడి నుంచి ఒడిసాలోని అంగూల్‌కు తీసుకెళ్లింది. అక్కడ 60.23 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను లోడ్‌ చేయించుకుని ఇక్కడికి వచ్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రె్‌సలను నడుపుతున్నామని జోన్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య తెలిపారు.

Updated Date - 2021-05-05T08:15:35+05:30 IST