Abn logo
Oct 24 2020 @ 06:16AM

మరో 694 కరోనా కేసులు

ఏలూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శుక్రవారం 694 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 89,600కు చేరింది. జిల్లాలో అత్యధికంగా భీమవరంలో 62 కేసులు రాగా, నరసాపురం 44, పాలకొల్లు 44, ఏలూరు 35, తాడేపల్లిగూడెం 32, మొగల్తూరు 26, ద్వారకా తిరు మల 24, వీరవాసరం 24, నిడమర్రు 22, జంగారెడ్డి గూడెం 21, పాలకోడేరు 21, యలమంచిలి 21, చింత లపూడి 20, పెనుమంట్ర 19, గణపవరం 15, పెంట పాడు 15, కాళ్ల 14, పెదవేగి 14, తణుకు 13, కొయ్య లగూడెం 12, ఉండి 12, గోపాలపురం 11, నిడదవోలు 10, పెనుగొండ 10 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా శుక్రవారం ఒకరు మరణించగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 487కు చేరింది. 

Advertisement
Advertisement