మరో 7,738 కేసులు

ABN , First Publish Date - 2020-09-21T08:21:11+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 72,455 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

మరో 7,738 కేసులు

 6,25,514కి పెరిగిన పాజిటివ్‌లు

కరోనాతో మరో 57 మంది మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో 72,455 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7,738 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,25,514కి పెరిగింది. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,260, పశ్చిమ గోదావరిలో 1,005, ప్రకాశంలో 869 కేసులు బయటపడ్డాయి. మరోవైపు రాష్ట్రంలో మరో 10,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 5,41,319కి పెరిగింది. కాగా.. కరోనా వైరస్‌ దెబ్బకు మరో 57 మంది మరణించారు.


కృష్ణాలో 8, అనంతపురంలో 7, చిత్తూరులో 7, ప్రకాశంలో 6, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 4, కర్నూలులో 4, కడపలో 3, శ్రీకాకుళంలో 3, పశ్చిమగోదావరిలో 3, గుంటూరులో 2, నెల్లూరులో 2, విజయనగరంలో ఇద్దరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 5,359కి చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారమూ 1,260 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 86,507కి పెరిగింది. ఇప్పటిదాకా 73,831 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. 12,191 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో 485 మంది కరోనాతో చనిపోయారు.


పశ్చిమలోనూ కేసులు 62 వేలు దాటేశాయి. తాజాగా 606 కేసులు నమోదు కాగా.. ముగ్గురు మరణించారు. అనంతపురంలో మరో 539 కేసులు బయటపడగా.. మొత్తం బాధితుల సంఖ్య 52,837కి చేరింది. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. కృష్ణ్లాలో కొత్తగా 439 మంది వైరస్‌ బారిన పడ్డారు. కరోనాతో ఒక్కరోజే 8 మంది మరణించారు. జిల్లాలో మొత్తం కేసులు 24,030కి, మరణాలు 389కి పెరిగాయి. విజయనగరంలో మరో 446 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య 31,519కి చేరగా.. మరణాలు 182కి పెరిగాయి. గుంటూరులో 582 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 51,065కి చేరింది. కరోనాతో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాలు 557కి పెరిగాయి.


కడపలో మరో 267 మందికి పాజిటివ్‌ వచ్చింది. కరోనాతో ముగ్గురు చనిపోయారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 39,716కి, మృతుల సంఖ్య 414కి చేరింది. చిత్తూరులో 794 మందికి వైరస్‌ సోకింది. కర్నూలులో 24 గంటల్లో 275 కేసులు నమోదవగా మరో నలుగురు మృతి చెందారు. విశాఖలో 342 పాజిటివ్‌లు బయటపడ్డాయి. జిల్లాలో మొత్తం కేసులు 47,366కి, మరణాలు 363కి చేరుకున్నాయి. నెల్లూరులో తాజాగా 444 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం కేసులు 50వేలకు చేరువయ్యాయి. శ్రీకాకుళంలో మరో 476 మంది వైరస్‌ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 36,239కు చేరింది.


Updated Date - 2020-09-21T08:21:11+05:30 IST