మరో 823 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-08-14T09:59:00+05:30 IST

జిల్లాలో గురువారం మరో 823 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,056కు చేరింది. 9,596 యాక్టివ్‌ కేసు

మరో 823 మందికి పాజిటివ్‌

జిల్లాలో 31,056కు చేరిన బాధితులు

ఆరుగురు మృతి 


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 13: జిల్లాలో గురువారం మరో 823 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వీరితో కలిపి పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,056కు చేరింది. 9,596 యాక్టివ్‌ కేసులు కాగా, 21,196 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో మరణాల సంఖ్య 264కు చేరింది. 


కర్నూలు నగరంలో 264 కేసులు

కర్నూలు నగరంలో గురువారం 264 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో నగరంలో కేసుల సంఖ్య 8,616కి చేరింది. వీరిలో 3,277 మంది చికిత్స పొందుతుండగా, 5,239 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు నగరంలో కరోనా చికిత్స పొందుతూ 109 మంది మరణించారు.


శ్రీశైలంలో కొత్తగా ఐదుగురు కరోనా బారిన పడ్డారు.  ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మంత్రాలయంలో 1, ఎమ్మిగనూరు రూరల్‌లో 1 కేసులు వచ్చాయి. 


 ఆలూరు మండలంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.  బేతంచెర్లలో 42 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 


 మిడుతూరు మండలంలో ఇద్దరు వృద్ధులు కరోనా పాజిటివ్‌తో జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు.  ఆదోని పట్టణంలో 28, రూరల్‌లో 5 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-08-14T09:59:00+05:30 IST