వాట్సప్‌నకు మరో ఆల్టర్నేటివ్‌ ‘వైర్‌’

ABN , First Publish Date - 2021-01-23T05:50:53+05:30 IST

వాట్సప్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌తో ఆందోళనకు గురవుతున్న వారి కోసం మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. సిగ్నల్‌, టెలిగ్రామ్‌ ఇప్పటికే హల్‌చల్‌ చేస్తుండగా ఈ రెంటికి ‘వైర్‌’ తోడైంది.

వాట్సప్‌నకు మరో ఆల్టర్నేటివ్‌ ‘వైర్‌’

వాట్సప్‌ ప్రైవసీ సెట్టింగ్స్‌తో ఆందోళనకు గురవుతున్న వారి కోసం  మరో ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. సిగ్నల్‌, టెలిగ్రామ్‌ ఇప్పటికే హల్‌చల్‌ చేస్తుండగా ఈ రెంటికి ‘వైర్‌’ తోడైంది. 

ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో వ్యక్తిగత మెసేజ్‌లు చూడటం సాధ్యం కాదని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌  చెబుతున్నప్పటికీ ప్రజలు వాటి మాటలు నమ్మడం లేదు. 

‘వైర్‌ సెక్యూర్‌ మెసెంజర్‌’ ఫ్రీ యాప్‌ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఫోన్‌ నంబర్‌, పేరు ఇవ్వకుండానే ఈ యాప్‌ను ఉపయోగించుకోగలగడం విశేషం. ‘వైర్‌’తో చాట్‌ చేసుకోవడంతోపాటు, ఇటు గ్రూపులుగా ఏర్పడి అటు మొబైల్‌, ఇటు డెస్క్‌టా్‌పపై వాడుకోవచ్చు. 2014లోనే ఆరంభమైనప్పటికీ, ఎందుకో ఇది ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోలేదు. టెక్స్‌టింగ్‌, గ్రూప్‌ చాట్‌, వీడియో, ఆడియో కాల్‌, మెసేజ్‌ మాయం కావడం, స్టయులస్‌ సపోర్ట్‌తో చేత్తో రాసిన ఫైల్స్‌ పంపుకోవడం, వాయిస్‌ మెసేజ్‌స్‌, ఫైల్‌ షేరింగ్‌, పింగ్‌ చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి. 

Updated Date - 2021-01-23T05:50:53+05:30 IST