Abn logo
Aug 4 2020 @ 05:44AM

మరో అవకాశం

భవనాల క్రమబద్ధీకరణకు మూడు నెలల గడువు పెంపు


కడప, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి) : మున్సిపల్‌, కార్పొరేషన్‌లో పట్టణ ప్రణాళిక అనుమతులు లేకుండా కట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకునే గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలనశాఖ జీవో నెం.339ని సోమవారం జారీ చేసింది. అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు ఇచ్చిన గడువు జూలై 31తో ముగిసింది. చాలామంది దరఖాస్తు చేసినప్పటికీ క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో మరో అవకాశం ఇచ్చినట్లయింది. జిల్లాలో భవనాల క్రమబద్ధీకరణ కోసం 617 దరఖాస్తులు వచ్చాయి. వీటిద్వారా ఆయా మున్సిపాలిటీలకు రూ.6.31 కోట్లు ఆదాయం వచ్చింది. కొందరు దఖాకాస్తు చేసినప్పటికీ అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ ఇవ్వకపోవడంతో క్రమబద్ధీకరించలేదు. ఇప్పుడు మరో మూడునెలలు అవకాశం ఇవ్వడంతో తగిన పత్రాలు అందిస్తే మిగతా వారు రెగ్యులర్‌ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
Advertisement