మరో సైబర్ మోసం

ABN , First Publish Date - 2021-06-18T01:19:54+05:30 IST

సైబర్ నేరగాళ్లకి చేతిలో మరో వ్యక్తి దారుణంగా మోసపోయారు. సైబర్ నేరాలపై

మరో సైబర్ మోసం

హైదరాబాద్: సైబర్ నేరగాళ్ల చేతిలో మరో వ్యక్తి దారుణంగా మోసపోయారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత చెబుతున్నా ప్రజలు మారడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో టీసీఎస్ ఉద్యోగినిని సైబర్ మోసగాళ్లు ట్రాప్ చేసారు. మూడున్నర లక్షలు మోసం చేశారు. ముషీరాబాద్‌కు చెందిన టీసీఎస్ ఉద్యోగిని హరిణికి మొబైల్‌కి సైబర్ కేటుగాళ్లు ఒక లింక్ పంపించారు. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌లో విప్రో ఇండస్ట్రీస్ పేజీ ఓపెన్ అయ్యింది. ఇంతలో హరిణికి కేటుగాళ్లు కాల్ చేసారు.


అందులో పెట్టుబడి పెడితే షేర్ మార్కెట్ ట్రెండింగ్‌లో ఉన్నందున వారం రోజుల్లో నాలుగు రెట్లు పెరుగుతుందని నమ్మించి మోసం చేశారు. కేటుగాళ్లు చెప్పిన విధంగా నాలుగు లక్షలను బాధితురాలు ట్రాన్స్‌ఫర్ చేసారు. మొత్తం మూడున్నర లక్షలను కేటుగాళ్లు కాజేసారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హరిణి సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-06-18T01:19:54+05:30 IST