Abn logo
Mar 9 2021 @ 19:30PM

నగరంలో మరో సైబర్‌ మోసం

హైదరాబాద్: నగరంలో మరో సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎంత చెబుతున్నా సైబర్ నేరగాళ్ల వలలో ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా అధిక లాభాలు వస్తాయనే ఆశతో ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన సురేష్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టాడు. సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా దాదాపు రూ.7లక్షలను ఆన్‌లైన్‌లో పెట్టుబడిగా పెట్టాడు. అయితే రోజులు గడుస్తున్నా తాను పెట్టిన డబ్బులకు లాభాలను ఇవ్వకపోవవడంతో 7లక్షలను మోసపోయానని తెలుసుకొన్నాడు. తనకు జరిగిన మోసంసై నగరంలోని సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితుడు సురేష్‌ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.