మరో దోపిడీ స్కీం

ABN , First Publish Date - 2021-02-23T05:38:25+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్కీడ్రా స్కీంల పేరిట దోపిడీ జరుగుతూనే ఉంది. లక్కీడ్రానే కాకుండా చీటీలు, రి యల్‌ ఎస్టేట్‌ స్కీంల పేరిట కొందరు అక్రమార్కులు స్కా ములకు పాల్పడుతున్నారు. అమాయక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆశచూపి తక్కువ డబ్బులకే ఎలకా్ట్రనిక్‌ వస్తువు లు, వాహనాలు బంగారం, ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని, తక్కువ పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నా రు.

మరో దోపిడీ స్కీం
కామారెడ్డిలో ప్రారంభమైన లక్కీడ్రా సంస్థ బ్రోచర్‌

లక్కీడ్రా స్కీం పేరిట కామారెడ్డిలో వెలుగులోకి వచ్చిన మరో సంస్థ

ఒక్కో సభ్యుడి నుంచి రూ.3వేలు వసూలు

ఏజెంట్ల ద్వారా అమాయకులకు గాలం

సభ్యులందరికీ బహుమతులంటూ ప్రచారం

ఇటీవలే నిజామాబాద్‌లో డ్రా నిర్వహణ

ఈనెల 27న కామారెడ్డిలో నిర్వహించేందుకు సన్నాహాలు

ఆ సంస్థకు అనుమతిలేదంటున్న పోలీసులు

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో లక్కీడ్రా స్కీంల పేరిట దోపిడీ జరుగుతూనే ఉంది. లక్కీడ్రానే కాకుండా చీటీలు, రి యల్‌ ఎస్టేట్‌ స్కీంల పేరిట కొందరు అక్రమార్కులు స్కా ములకు పాల్పడుతున్నారు. అమాయక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆశచూపి తక్కువ డబ్బులకే ఎలకా్ట్రనిక్‌ వస్తువు లు, వాహనాలు బంగారం, ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని, తక్కువ పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ వల వేస్తున్నా రు. వేలాది మంది ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కోట్లాది రూపాయలతో ఉడాయిస్తున్న సంఘటనలు నిజా మాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పరిపాటిగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నూ అనుమతులు లేకుండా లక్కీడ్రా స్కీంలను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. 

నెలకు రూ.3 వేలు

తాజాగా.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఓ ప్రైవేటు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా లక్కీడ్రా స్కీంను కొనసాగిస్తోంది. ఇటీవల నిజామాబాద్‌ జిల్లాలో డ్రా నిర్వహించగా ఈ స్కీంలో ఉన్న సభ్యులకు బహుమతు లు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే సంస్థకు చె ందిన నిర్వాహకులు ఈనెల 27న కామారెడ్డి జిల్లా కేంద్రం లో లక్కీడ్రాకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ‘అక్కలు..  వదినలు.. చెల్లెలు, అన్నలు.. తమ్ముళ్లు.. మీ తోటి ఫ్రెండ్స్‌కు మా నమస్కారాలు.. కామారెడ్డి జిల్లా అశోక్‌నగర్‌లో ఈనెల 27న లక్కీడ్రా ఉందని.. పాల్గొనేవారు ఎవరైనా ఈ డ్రాకు రూ.3వేలు కట్టి ఆకర్షణీయమైన బహుమతులు పొందాలం టూ వారి ఏజెంట్ల ద్వారా అమాయక ప్రజలను చేర్చుకుం టూ ఓ సంస్థ లక్కీడ్రా స్కీంను నిర్వహిస్తోంది. ఈ స్కీంలో మొత్తం 3,999 మంది సభ్యులుంటారు. ఈ స్కీం కాలవ్యవ ధి ఒక నెల అని నమ్మబలికిస్తున్నారు. సభ్యులను చేర్చుకుని సభ్యత్వ రుసుము రూ.3వేలు వసూలు చేస్తున్నారు. చేరిన వారందరికీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మబలికి స్తున్నారు. ప్రతినెలా రూ.3 వేలు వసూలు చేస్తూ డ్రా వెళ్లని వారికి ఏదో ఒక చిన్న బహుమ తి ఇస్తామని చెబుతున్నారు. ఇ లా లక్కీడ్రా నిర్వాహకులు ఏజె ంట్ల ద్వారా సభ్యులను చేర్పించు కుంటున్నారు. ఈ స్కీం కేవలం స్నే హితులు, బంధువులకు మాత్రమేనని పేర్కొంటూ నిరక్ష్యరాసులను ఇందులో చేర్పి స్తున్నారు. అనంతరం గొలుసుకట్టు తరహాలో స్నే హితులు, బంధువులను చేర్పించమని ఒత్తిడి చేస్తున్నారు.

సులభ వాయిదా పద్ధతి అంటూ వల

లక్కీడ్రా స్కీంలు నిర్వహించే వారు సులభ వాయిదా ప ద్ధతులపై ఆకర్షనీయమైన వస్తువులను అందజేసే సదుపా యం కల్పిస్తామని నమ్మబలుకుతూ మహిళలను సభ్యులు గా చేర్పిస్తున్నారు. మా కంపెనీలో ప్రతినెలా పొదుపుచేసి గృహ ఉపయోగవస్తువులు పొందాలని పేర్కొంటున్నారు. స భ్యులకు నెలకు కొందరికి చొప్పున ప్రతి సభ్యుడికి కచ్చితం గా బహుమతులు అందిస్తామంటూ నమ్మక బలుకుతున్నా రు. అందమైన, ఆకర్షణీయమైన బ్రోచర్‌లను ముద్రించి ప ట్టణ కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ తిరుగుతారు. ఈ స్కీ ంలో చేరిన సభ్యులను నమ్మించేందుకు నెలకోచోట లాటరీ తీస్తూ బ్రోచర్‌లో పేర్కొన్న విధంగా ఒక్కొక్కరికి, ఒకరిద్దరికి బహుమతులు ఇస్తారు. బ్రోచర్‌ల మీద వారి చిరునామా, కార్యాలయాల వంటి వివరాలు ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లా లో నిర్వహించే ఈ స్కీంలకు ఏ శాఖ నుంచి కూడా అనుమతు లు ఉండవు. అసలు ప్రభు త్వ శాఖల పరంగా ఈ స్కీ ంలకు ప్రోత్సాహం సైతం ఉండదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ, పు ట్టగొడుగుళ్లా లక్కీడ్రా స్కీ ంలు వెలుస్తూనే ఉన్నాయి. మున్సిపల్‌, పంచాయతీ శా ఖల నుంచి ఎలాంటి అనుమ తులు ఉండవు. మోసాలకు పాల్ప డే లక్కీడ్రా స్కీంలపై పోలీసుశాఖ నిఘా పెట్టాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి చ ర్యలు తీసుకోకపోవడంతో నిర్వాహకులు ఈ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నష్టపోతున్నది అమాయకులే..

ఈ లక్కీడ్రా స్కీంలలో ఎక్కువగా అమాయక ప్రజలే న ష్టపోతున్నారు. తక్కువ డబ్బుకు లాభసాటి వస్తువులు బ హుమతులుగా వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అలా అమాయక ప్రజల ఆశనే ఆసరాగా చేసుకుంటూ మో సగాళ్లు లక్కీడ్రా స్కీంల పేరిట దందాను కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గతంలో బీర్షాబా లాంటి సంస్థ స్కీంల పేరిట వందల మంది అమాయకులను మోసం చే సిన సంఘటన తెలిసిందే. ఈ సంస్థనే కాకుండా ఎన్నో కం పెనీలు ఇలా లక్కీడ్రా స్కీంల పేరిట నెల నెలా గ్రామీణ ప్రాంతాల్లోని అమాయక ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డ బ్బులు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేసి ఉడా యించిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి లక్కీ డ్రా స్కీంల పేరిట మోసగాళ్ల చేత మోసపోవద్దంటూ పోలీ సు శాఖ పదేపదే చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రా వడం లేదని ఆ శాఖకు సంబంధించిన అధికారులు చెబుతు న్నారు. ఎదో ఒక లక్కీడ్రా స్కీంలో పెట్టుబడులు పెడుతూ మోసపోతూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రం లో మరో సంస్థ ఆకర్షణీయమైన బహుమతుల పేరిట లక్కీ డ్రా స్కీంను నిర్వహిస్తూ వేలమంది సభ్యులను చేర్చుకుని రూ.లక్షలు వసూలు చేసి డ్రా పేరిట దోపిడీకి తెరలేపినట్లు బాధితుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ముందుగానే అప్రమత్తమై సదరు సంస్థపై నిఘాపెట్టి అమాయక ప్రజలు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

మా దృష్టికి రాలేదు.. నిఘా పెడతాం

- మధుసూదన్‌రావు, సీఐ, కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ సంస్థ పేరిట లక్కీ డ్రా ని ర్వహిస్తున్నారనే విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. ఎవ రు కూడా ఫిర్యాదు చేయలేదు. బాధితులు ఎవరైనా ఫిర్యా దు వెంనే చేస్తే చర్యలు తీసుకుంటాం. లక్కీ డ్రా సంస్థపై నిఘా పెట్టి విచారణ చేపడతాం. చట్టవిరుద్ధంగా లక్కీడ్రా స్కీంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-02-23T05:38:25+05:30 IST