ఢిల్లీలో మరో ‘గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా’

ABN , First Publish Date - 2021-07-17T06:24:38+05:30 IST

గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా మనదేశంలో రెండో క్లౌడ్‌ రీజియన్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏర్పాటు చేస్తోంది. దీంతో కస్టమర్లు ముఖ్యంగా పబ్లిక్‌ సెక్టార్‌కు ఉపయోగం.

ఢిల్లీలో మరో ‘గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా’

గూగుల్‌ క్లౌడ్‌ ఇండియా మనదేశంలో రెండో క్లౌడ్‌ రీజియన్‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఏర్పాటు చేస్తోంది. దీంతో కస్టమర్లు ముఖ్యంగా పబ్లిక్‌ సెక్టార్‌కు ఉపయోగం. మొదటిది ముంబైలో ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఇది 26వది కాగా ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో పదోది. క్లౌడ్‌ రీజియన్స్‌ అంటే ఫిజికల్‌ జాగ్రఫిక్‌ లొకేషన్స్‌ కింద లెక్క. దీంతో క్లౌడ్‌ బేస్డ్‌ పనులతోపాటు డేటాపరంగా కస్టమర్లకు ప్రయోజనం ఉంటుంది. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే తమ ఉనికిని మనదేశంలో బలపర్చుకుంటున్నాయి. ఈ ఏర్పాటుతో వాటితో గూగుల్‌ క్లౌడ్‌ పోటీపడగలదు. అన్ని రకాల కంపెనీలు తమకు ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్ళను సమర్థంగా వీటితో  ఎదుర్కొనవచ్చని ఈ సందర్భంగా గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా రిటైల్‌, హెల్త్‌కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌, కమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితరాలపై గూగుల్‌ క్లౌడ్‌ ఫోకస్‌ చేయనుంది. డిజాస్టర్‌ రికవరీలో తోడ్పడనుంది. 

Updated Date - 2021-07-17T06:24:38+05:30 IST