డీహెచ్‌ఎ‌ఫ్‌ఎల్‌ ప్రమోటర్ల మరో భారీ స్కామ్‌

ABN , First Publish Date - 2021-03-25T06:10:34+05:30 IST

ఆర్థిక మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై కటకటాల పాలైన దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌)

డీహెచ్‌ఎ‌ఫ్‌ఎల్‌ ప్రమోటర్ల మరో భారీ స్కామ్‌

  • పీఎంఏవై నుంచి రూ.1,884 కోట్లు దండుకున్న వైనం 
  • కపిల్‌, ధీరజ్‌ వాద్వాన్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ 

 న్యూఢిల్లీ: ఆర్థిక మోసం, మనీలాండరింగ్‌ ఆరోపణలపై కటకటాల పాలైన దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) ప్రమోటర్లు కపిల్‌, ధీరజ్‌ వాద్వాన్‌ సోదరుల సరికొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చిం ది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) నుంచి అక్రమంగా వేల కోట్లు దండుకున్న వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రస్తుత బోర్డు నియమించిన ఆడిటర్‌ గ్రాంట్‌ థోర్నట్‌ ఆడిటింగ్‌ నివేదికలో ఈ విషయం బయటపడింది. ఈ సోదరులిద్దరూ 2007-19 మధ్యకాలంలో మనుగడలో లేని బ్రాంచ్‌ నుంచి రూ.14,000 కోట్లకు పైగా విలువ చేసే 2.6 లక్షల నకిలీ, బోగస్‌ గృహ రుణ ఖాతాలను తెరిచి, పీఎంఏవై నుంచి అక్రమంగా రూ.1,880 కోట్ల వడ్డీ సబ్సిడీ పొందినట్లు దర్యాప్తు ఏజెన్సీ వెల్లడించింది.


దేశంలో అందరికీ ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2015 అక్టోబరులో పీఎంఏవైని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం బలహీన, అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణ వడ్డీపై సబ్సిడీ కల్పిస్తోంది. వీరు గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీని ఆర్థిక సంస్థల ద్వారా క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2021-03-25T06:10:34+05:30 IST