Abn logo
Jan 20 2021 @ 17:19PM

`ఎఫ్3`లో మరో మెగా హీరో?

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఎంటర్‌టైనర్ `ఎఫ్2`. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్‌ కాకుండా మరో మెగా హీరో కనిపించనున్నాడట. 


మెగా హీరో సాయితేజ్ `ఎఫ్3`లో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతున్నాడట. సాయితేజ్ పాత్ర 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుందట. నిర్మాత దిల్ రాజుతోనూ, డైరెక్టర్ అనిల్ రావిపూడితోనూ సాయితేజ్‌కు మంచి అనుబంధం ఉంది. అందుకే వారి కోరిక మేరకు `ఎఫ్3`లో అతిథి పాత్ర చేసేందుకు సాయితేజ్ ఒప్పుకున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. 


Advertisement
Advertisement
Advertisement