Jul 17 2021 @ 10:49AM

మానసకి టాలీవుడ్‌లో మరో ఆఫర్..?

మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ ఇటీవల ఓ తెలుగుగు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈమెను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవన్ని కేవలం పుకార్లు మాత్రమేనని స్వయంగా మానస క్లారిటీ ఇచ్చింది. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం 'హైవే'తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తయితే ఈ ఏడాదే 'హైవే' చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాగా మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మానసకి టాలీవుడ్‌లో మరో అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. చుడటానికి అచ్చతెలుగమ్మాయిలా కనిపిస్తున్న మానసతో పలువురు నిర్మాతలు సంప్రదింపులు జరుతుపుతున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ మలయాళీ బ్యూటీ ఏమేరకు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో.