నిజామాబాద్ జిల్లాలో మరో పది కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-08T22:12:26+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంతో పాటు జిల్లాలోని ఇ తర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. నగరంలో ని చంద్రశేఖర్‌నగర్‌కాలనీలో రెండు, అర్సపల్లిలో

నిజామాబాద్ జిల్లాలో మరో పది కరోనా కేసులు

నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మంగళవారం కొత్తగా పది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నగరంతో పాటు జిల్లాలోని ఇ తర ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. నగరంలో ని చంద్రశేఖర్‌నగర్‌కాలనీలో రెండు, అర్సపల్లిలో మూ డు, సీతారాంనగర్‌లో ఒక కేసు నమోదైంది. అలాగే సిరికొండ మండలంలో ఒకటి, బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాకాసిపేట్‌లో ఒకటి, భీమ్‌గల్‌లో ఒకటి, వర్నిలో ఒక కేసు నమోదయింది. కొన్ని జిల్లాలో నిర్వహించిన పరీక్షలలో బయట పడగా, మరికొన్ని హైదరాబాద్‌లో వెల్లడయ్యాయి. వర్నికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి పాజిటివ్‌ రావడతో అధికారులు అతడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నారు. జిల్లాలో మంగళవారం వ రకు 162 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 81 మంది చికిత్స పొంది డిశ్చార్జి కాగా, నలుగురు మృతిచెందారు. 77 మంది జిల్లా కేంద్ర జనరల్‌ ఆసుపత్రితో పాటు హైదరాబాద్‌లో వివిధ ప్రైవేటు, ప్రభుత్వ ఆసు పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


రోజురోజుకూ పెరుగుతున్న కేసులు.. 

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పె రుగుతున్నాయి. కేసులసంఖ్య పెరుగుతుండడంతో అధి కారులు ప్రైమరి, సెకండరి కాంటాక్ట్స్‌పైన దృష్టిపెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాలను చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో చర్యలను తీసుకోవడంతో పాటు వారు కలిసిన వారిని హోంక్వారంటైన్‌ లో ఉండాలని కోరుతున్నారు. నిత్యం వైద్యసిబ్బంది వెళ్లి వారిని పరిశీలిస్తున్నారు. కేసులు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో వస్తుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలతో పా టు అధికారులు కూడా ఆందోళన చెదుతున్నారు. గ్రా మాల పరిధిలో కేసులు తక్కువగాఉన్నా నగరంతో  పా టు ఇతర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడంతో ముందస్తు  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


వర్నిలో కరోనా కలవరం

వర్ని ఉమ్మడి మండలంలో కరోనా వైరస్‌ కలవర పెడుతోంది. ఇప్పటికే మోస్రా మండల కేంద్రంలో ఆరుగురు కరోనా వ్యాధి బారినపడగా తా జాగా వర్నికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి మంగళవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత శనివారం ఆయకు కా ళ్లు, చేతులు లాగడంతో వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్‌ లో నిమోనియా, రక్తకణాలు పడిపోవడం, షుగర్‌, బీపీ సమస్యలు రావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల ఓ ప్రైవేటు ఆసుప త్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అతని డ్రైవర్‌, కుమారుడు, సోద రుడు హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. కాగా సదరు ప్రజా ప్రతినిధి అనారోగ్య సమస్యకు ముందురోజు వర్ని, జా కోర, జలాల్‌పూర్‌లో రైతువేదికల నిర్మాణాలు, హరిత హారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అతనికి కరోనా నిర్ధా రణ కావడంతో పార్టీ నాయకుల గుండెల్లో దడ మొద లైంది. ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న పలు వురు ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం క రోనా పరీక్షల నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రులకు పరుగులు పెట్టారు.


బ్యాంకు సిబ్బందిలోనూ ఆందోళన..

వర్ని మండల కేంద్రంలోని ఓ బ్యాంకు సిబ్బందినీ కరోనా గుబులు పెడుతోంది. గాంధారి మండల కేం ద్ర ంలోగల ఓ బ్యాంకు అధికారి గత నెలాఖరులో వర్ని బ్రాంచిని సందర్శించి వెళ్లగా ఈనెల 6న సదరు అధికా రి కరోనా బారిన పడ్డట్లు వర్ని వైద్యాధికారి వెంకన్న తె లిపారు. దీంతో ముందు జాగ్రత్తగా వర్ని బ్రాంచి బ్యాం కు సిబ్బందిని పరీక్షల నిమిత్తం అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. వర్ని ఉమ్మడి మండలంలో కరోనా వ్యా ప్తితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజా ప్రతినిధికి కరోనా ఎలా వ్యాప్తి చెందిందోనన్న కోణంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


సిరికొండలో అటవీశాఖ ఉద్యోగికి..

సిరికొండలో అటవీ శాఖ ఉద్యోగికి కరో నా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ మోహన్‌ తెలిపారు. సదరు అధికారి శిక్షణ కోసం ఇటీ వల హైదరాబాద్‌ వెళ్లగా అక్కడ సోకి ఉంటుందని వై ద్యాధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం అతను హోం క్వారం టైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2020-07-08T22:12:26+05:30 IST