Abn logo
Aug 2 2021 @ 00:36AM

కీలక స్థాయిల్లో మరో పరీక్ష

నిఫ్టీ గత వారం బలమైన కరెక్షన్‌లో ప్రారంభమై దిగువ మానసిక అవధి 15500 వరకు దిగజారి తదుపరి మంచి రికవరీ సాధించింది. వారం మొత్తానికి 93 పాయింట్ల స్వల్ప నష్టంతో క్లోజైంది. ఈ రికవరీ ద్వారా మరింత డౌన్‌ట్రెండ్‌ను నివారించుకుంది. ప్రస్తుతం మార్కెట్‌ 16000-15500 మధ్యన నిలిచి ఉంది. నెలవారీ చార్టుల ప్రకారం సైతం మార్కెట్‌ నెల పరిధికి మధ్యలో అనిశ్చితంగా ముగిసింది. ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ ఎగువకే ఉంది. పెద్ద కదలిక ఏర్పడితే తప్ప ట్రెండ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. మరోసారి ఎగువ మానసిక అవధి 16000 వద్ద పరీక్షకు గురయ్యే ఆస్కారం ఉంది. గత నెలలో గరిష్ఠ స్థాయిల్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు (రూ.23,000 కోట్లు), కనిష్ఠ స్థాయిలో దేశీయ ఇన్వెస్టర్ల మద్దతుతో (రూ.19,000 కోట్లు) సైడ్‌వేస్‌ ధోరణిలో ఉంది. 16000 మధ్యకాలిక స్థాయి కావడం వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.


బుల్లిష్‌ స్థాయిలు : మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 15880 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 15940, 16000. ఈ స్థాయిని బ్రేకౌట్‌ చేసినప్పుడే ర్యాలీకి ఆస్కారం ఉంటుంది. ఆ పైన మానసిక అవధులు 16300, 16550. 


బేరిష్‌ స్థాయిలు : ప్రధాన మద్దతు స్థాయి 15700 కన్నా దిగజారితే మరింత స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. మరో ప్రధాన మద్దతు స్థాయి 15450. ఇక్కడ కూడా విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్‌ తప్పదు.


బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం 450 పాయింట్ల మేర కు నష్టపోయి వారం కనిష్ఠ స్థాయిలో ఉంది. ఇది బలహీనత సంకేతం. టెక్నికల్‌గా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు మెరుగ్గాను, ప్రైవేటు రంగ బ్యాంకు స్టాక్‌లు బలహీనంగాను ముగిశాయి. 35000 వద్ద బలమైన నిరోధం కనిపిస్తోంది. 


పాటర్న్‌: నెలవారీ చార్టులకు చెందిన ఆర్‌ఎ్‌సఐ (8) సూచీ 80 వద్ద ఉంది. ఇది ఓవర్‌బాట్‌ సంకేతం. మార్కెట్‌ ప్రస్తుతం 50 డిఎంఏ వద్ద ఉంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మరింత ర్యాలీ కోసం 16000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధాన్ని ఛేదించాలి. 


టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళ, గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉన్నాయి. 

టెక్‌ బెట్స్‌

చోళమండలం ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ :  కొద్ది వారాలుగా ఈ షేరు రూ.650 వద్ద కన్సాలిడేషన్‌ అవుతూ వస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.661 వద్ద క్లోజైంది. ఈ షేరు స్వల్పంగా పడినప్పుడు కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అప్‌ట్రెండ్‌లో సాగితే తదుపరి నిరోధ స్థాయి లు రూ.710, రూ.740. ఒకవేళ రూ.630 దిగువకు చేరితే దాన్ని స్టాప్‌లా్‌సగా పరిగణించి వెలుపలికి రావటం మంచిది.


మహానగర్‌ గ్యాస్‌ (ఎంజీఎల్‌) : ఈ షేరు రూ.1,150 స్థాయిల వద్ద కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. గత వారం రూ.1,167 వద్ద పటిష్ఠంగా క్లోజైంది. స్వల్పంగా పడినప్పుడు ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించచ్చు. తదుపరి రూ.1,210, రూ.1,250 నిరోధ స్థాయిలుగా ఉంటా యి. ఒకవేళ రూ.1,100 దిగువకు పడిపోతే దాన్ని స్టాప్‌లాస్‌గా పెట్టుకుని ఎగ్జిట్‌ కావచ్చు.