ఢిల్లీ కేపిటల్స్ గన్ పేస్‌మన్ అన్రిక్‌కు నెగటివ్.. పాజిటివ్ వార్తలపై ఢిల్లీ ఫైర్

ABN , First Publish Date - 2021-04-17T01:33:55+05:30 IST

మూడు కొవిడ్ నెగటివ్ టెస్టుల తర్వాత ఢిల్లీ కేపిటల్స్ జట్టు గన్ పేస్‌మన్ అన్ర్రిక్ నోర్జే నేడు జట్టు బయోబబుల్‌లోకి

ఢిల్లీ కేపిటల్స్ గన్ పేస్‌మన్ అన్రిక్‌కు నెగటివ్.. పాజిటివ్ వార్తలపై ఢిల్లీ ఫైర్

న్యూఢిల్లీ: మూడు కొవిడ్ నెగటివ్ టెస్టుల తర్వాత ఢిల్లీ కేపిటల్స్ జట్టు గన్ పేస్‌మన్ అన్ర్రిక్ నోర్జే నేడు జట్టు బయోబబుల్‌లోకి ప్రవేశించాడు. అన్రిక్ జట్టుతో కలిసినట్టు పేర్కొన్న ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజీ.. అతడికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తలపై మండిపడింది. నిజానికి అన్రిక్‌కు ఎప్పుడూ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది. కానీ ఓ తప్పుడు రిపోర్టు కారణంగా అతడికి వైరస్ సోకినట్టు వార్తలు హల్‌చల్ చేశాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఢిల్లీ కేపిటల్స్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో నోర్జే మాట్లాడుతూ.. మైదానంలో దిగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు.


గత సీజన్‌లో నోర్జే ఆకట్టుకున్నాడు. 16 మ్యాచుల్లో 22 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ కేపిటల్స్ తొలిసారి ఫైనల్‌కు చేరుకోవడంలో రబడతో కలిసి నోర్జే కీలక పాత్ర పోషించాడు. రబడ 17 మ్యాచుల్లో 30 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.  కాగా, ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఈ నెల 18 ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ తలపడనుంది. 

Updated Date - 2021-04-17T01:33:55+05:30 IST