America Lockdownపై ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-08-02T06:04:51+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విజృంభణ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌పై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థ

America Lockdownపై ఆంథోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో విజృంభణ నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్‌పై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోనీ ఫౌచీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మరోసారి దేశంలో లాక్‌డౌణ్ విధించే పరిస్థితులు ఏర్పడకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘మహమ్మారి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కారణంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. అయితే గతేదాడి మాదిరిగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే పరిస్థితులు ఏర్పడకపోవచ్చు’ అని అన్నారు. అంతేకాకుండా అపోహలను పక్కన టీకా తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని ఆయన సూచించారు. టీకా తీసుకున్న వారికి మహమ్మారి సోకినప్పటికీ.. తీవ్ర అనారోగ్యం, ఆసుపత్రి బారినపడకుండా వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. 


Updated Date - 2021-08-02T06:04:51+05:30 IST