కరోనా యాంటీబాడీ 3నెలల ముచ్చటే!!

ABN , First Publish Date - 2020-07-14T07:23:54+05:30 IST

కరోనా ఇన్ఫెక్షన్‌ తగ్గిన మూడు నెలలకే మళ్లీ తిరగబడొచ్చని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వైర్‌సను తిప్పికొట్టేందుకు రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే ప్రతిరక్షకాలు...

కరోనా యాంటీబాడీ 3నెలల ముచ్చటే!!

లండన్‌, జూలై 13 : కరోనా ఇన్ఫెక్షన్‌ తగ్గిన మూడు నెలలకే మళ్లీ తిరగబడొచ్చని బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. వైర్‌సను తిప్పికొట్టేందుకు రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే ప్రతిరక్షకాలు(యాంటీబాడీ) మూడు నెలల తర్వాత గణనీయంగా (17 శాతానికి) తగ్గిపోతున్నాయని వారు గుర్తించారు. మార్చి నుంచి జూన్‌ మధ్యకాలం లో కరోనా బారినపడిన 90 మందికి ప్రతిరోజు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించగా వచ్చిన నివేదికల విశ్లేషణ అనంతరం ఈ నిర్ధారణకు వ చ్చినట్లు తెలిపారు. జలుబు, ఫ్లూ లాగే.. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా కోలుకున్న రోగులను మళ్లీ చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయన్నారు.


Updated Date - 2020-07-14T07:23:54+05:30 IST