లాక్‌డౌన్ వ్యతిరేక ఉద్యమం హింసాత్మకం.. 240మంది అరెస్టు!

ABN , First Publish Date - 2021-01-26T11:21:54+05:30 IST

లాక్‌డౌన్ విధించ వద్దంటూ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో ఈ ఉద్యమంలో పాల్గొన్న 240 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కరోనా విజృంభిస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం..

లాక్‌డౌన్ వ్యతిరేక ఉద్యమం హింసాత్మకం.. 240మంది అరెస్టు!

ఆమ్‌స్టర్‌డ్యామ్: లాక్‌డౌన్ విధించ వద్దంటూ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో ఈ ఉద్యమంలో పాల్గొన్న 240 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ కరోనా విజృంభిస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కనీసం 10 సిటీల్లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలు.. హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ పోలీసులు దాదాపు 240మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-01-26T11:21:54+05:30 IST