కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రెండు నెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు!

ABN , First Publish Date - 2021-09-14T13:42:22+05:30 IST

దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు...

కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రెండు నెలలకే తగ్గిపోతున్న యాంటీబాడీలు!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన ఫలితాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. 


 ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్(భువనేశ్వర్) తెలిపిన వివరాల ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిలో రెండు నెలల వ్యవధిలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నది. దీని గురించి డాక్టర్ దేవదత్త భట్టాచార్య మాట్లాడుతూ తాము కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న 614 మందిపై అధ్యయనం చేశామన్నారు. వారిలో యాంటీబాడీల స్థాయి గురించి ఆరు నెలల పాటు పరిశీలించామన్నారు. దీనిలో కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో రెండు నెలల లోపునే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని తెలిపారు. అదేవిధంగా కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో మూడు నెలలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని గుర్తించామన్నారు. బూస్టర్ డోసు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేశామన్నారు.

Updated Date - 2021-09-14T13:42:22+05:30 IST