కడుపులో అగ్నికి విరుగుడు!

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

కడుపులో, ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు అసిడిటీ లక్షణాలు. నిత్యం వేధించే అసిడిటీని అడ్డుకోవాలంటే తక్కువ

కడుపులో అగ్నికి విరుగుడు!

కడుపులో, ఛాతీలో మంట, పుల్లని త్రేన్పులు అసిడిటీ లక్షణాలు. నిత్యం వేధించే అసిడిటీని అడ్డుకోవాలంటే తక్కువ పరిమాణాల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగడం చేయాలి. అలాగే వేపుళ్లు, మసాలాలు తగ్గించాలి. రాత్రివేళ పెందలాడే భోజనం ముగించాలి. కాఫీలు, టీలు, శీతల పానీయాలు తగ్గించాలి. వేళపట్టున ఆహారం తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే అసిడిటీని తగ్గించే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందుకోసం....


పుచ్చ: పుచ్చ రసం దాహార్తిని తీర్చడంతో పాటు కడుపులో చల్లదనాన్ని పెంచుతుంది.


దోస: శరీరాన్ని చల్లబరిచి, ఆమ్ల గుణాన్ని తగ్గించే దోసపండును తరచుగా తింటూ ఉండాలి.


తర్బూజా: ఈ పండు తేలికగా అరగడంతో పాటు, శక్తినిస్తుంది. కడుపులో మంటను చల్లారుస్తుంది.


అల్లం, సోంపు: గోరువెచ్చని నీళ్లలో అల్లం రసం, సోంపు పొడి కలిపి తీసుకుంటే అసిడిటీ తగ్గుతుంది.


కొబ్బరినీళ్లు: శరీరంలో లోపించిన ఖనిజ లవణాలను భర్తీ చేయడం ద్వారా శరీరంలో క్షారత్వం తగ్గించి, అసిడిటీని తగ్గించే గుణం కొబ్బరినీళ్లకు ఉంది. కాబట్టి తరచుగా కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.


Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST