‘మోడెర్నా’ వ్యాక్సిన్‌తో కొవిడ్‌కు విరుగుడు

ABN , First Publish Date - 2020-10-01T09:16:16+05:30 IST

కొవిడ్‌ నివారణకు అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేసిన ‘మోడెర్నా’ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తున్నట్లు తొలి దశ ఫలితాల్లో తేలింది...

‘మోడెర్నా’ వ్యాక్సిన్‌తో కొవిడ్‌కు విరుగుడు

బోస్టన్‌, సెప్టెంబరు 30: కొవిడ్‌ నివారణకు అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేసిన ‘మోడెర్నా’ వ్యాక్సిన్‌ బాగా పని చేస్తున్నట్లు తొలి దశ ఫలితాల్లో తేలింది. అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ, ఇన్ఫెక్షన్‌ డిసీజెస్‌, అమెరికన్‌ బయోటెక్‌ కంపెనీ సంయుక్తంగా తయారు చేసిన ఈ టీకా వృద్ధుల్లోనూ ఇమ్యూనిటీని పెంచుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఇది న్యూ ఇం గ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. కరో నా దుష్ప్రభావాలు తీవ్రంగా కనబర్చే 55 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్‌ వల్ల చాలా లాభం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్చి 16న ప్రారంభమైన తొలి దశ ట్రయల్స్‌లో నెల రోజుల త ర్వాత వృద్ధులనూ చేర్చారు. ఆరోగ్యవంతులైన 56-70 ఏళ్ల మధ్య వయసు గల 20 మంది వాలంటీర్లు, 71 ఏళ ్లకు పైబడిన 20 మంది వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చా యి. అందులో 10 మందికి తక్కువ డోస్‌, మరో 10 మందికి ఎక్కువ డోస్‌ ఇచ్చారు. నెల రోజుల తర్వాత రెండో డోస్‌ ఇచ్చారు. ఈ టీకాతో కరోనాను దూరం చేయగలమని గుర్తించామని పరిశోధకులు తెలిపారు.

Updated Date - 2020-10-01T09:16:16+05:30 IST