కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2021-06-15T05:54:33+05:30 IST

రైతులు, కార్మికుల కన్నీటికి కారణమైన ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు.

కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ 

కూర్మన్నపాలెం, జూన్‌ 14: రైతులు, కార్మికుల కన్నీటికి కారణమైన ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 123వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి రాజశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.   విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాటట్లాడుతూ ఉపాధి అవకాశాలను హరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణకు పోరాట పటిమ చూపాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు,    బి.మురళీ రాజు, నీరుకొండ రామచంద్రరావు, మోహన్‌, జగదీశ్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-15T05:54:33+05:30 IST